ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకై.. "హైడ్రా" 'టోల్ ఫ్రీ..

వాట్సప్ చేయండి.. ప్రభుత్వ ఆస్తులు రక్షించండి..

హైడ్రా కమిషనర్‌ ఏ.వి రంగనాథ్ ఐపిఎస్ ప్రకటనతో కబ్జాదారులకు వణుకు..

"టోల్ ఫ్రీ నెంబర్ 18005990099" నెంబర్.. 

"కంట్రోల్ రూం 04029560509, 040 29560596, 04029565758, 04029560953..

వాట్సప్ సమాచారం నేరుగా కమిషనర్‌‌కి పంపించే వివరించాలనుకుంటే ఫోన్. 7207923085..

హైడ్రా అధికారిక మెయిల్ ఐడీ directorateof-  evdm@gmail.com మెయిల్‌కు ఫిర్యాదు..

ఫిర్యాదు దారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్న కమిషనర్ ఏవి.రంగనాథ్..

ఏ.వి.రంగనాథ్ ఐపీఎస్.. 'హైడ్రా' కమిషనర్..

 

అప్పుడు "టిజి-బిపాస్"..! ఇప్పుడు "హైడ్రా" కమిషన్..! చట్టాలు కఠినంగా సక్రమంగానే ఉంటున్నాయి కానీ..! చట్టంలోని లొసుగులే ప్రభుత్వ ఆస్తులకు ఎసరు పెడుతున్నాయి.. 2019 మున్సిపల్ చట్టాన్ని కూడా కఠినమైన నిబంధనలతో అమలు చేసిందే..! అక్రమ నిర్మాణాలపై ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కూల్చివేయవచ్చనే సెక్షన్‌లు చట్టంలో పొందుపరచబడ్డాయి..! ఇక అధికారుల అవినీతికి చెక్ పెట్టినట్టే అన్నారు..! కానీ ఏమైంది..? టౌన్‌ప్లానింగ్ వ్యవస్థ పక్కా పథకం ప్రకారం ప్రణాళిక రూపొందించారని ఆరోపణలు వచ్చాయి..! ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడంతో..! "డూ ప్రాసెస్ ఆఫ్ లా" ప్రకారం నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.. దీంతో అధికారుల ఆమ్యామ్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.. చెరువుల్లో అక్రమ కట్టడాలు..! ప్రభుత్వ భూముల కబ్జాల్లోనూ..!  నోటీసుల పేరుతో, చర్యలు తీసుకోకుండా..! కబ్జాదారులకు సహకరిస్తూ..! ప్రమాదకర అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు.. ఈ విషయాన్ని నిత్యం "పెన్ పవర్" దినపత్రికలో ప్రచురించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ప్రయోజనం శూన్యం.. అయినా అధికారుల ఉద్దేశంలోనే మార్పులు లేనప్పుడు..! చట్టాల్లో మార్పు తెస్తే వ్యవస్థ మారుతుందా..? అంటూ ఎద్దేవా చేసేవారు లేకపోలేదు..*

జీడిమెట్లలో ఫాక్స్‌సాగర్ నాలాపై భారీ నిర్మాణం.. అధికారుల సౌజన్యంతోనే..!
ఫాక్స్‌సాగర్ నాలాపై నిర్మిస్తున్న అక్రమ నిర్మాణం.. ఇదే..

 

మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, జూలై 29:

ప్రభుత్వ భూములు కబ్జాలు.. చెరువులు, కట్టుకాలువలు, చారిత్రక నాలాలు ఆక్రమణలకు చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సరికొత్త ఆలోచనతో "ఆపరేషన్ "హైడ్రా"ను రూపొందించారు..! ఆపరేషన్‌కి ఏ.వి.రంగనాథ్ ఐపీఎస్‌ను కమిషనర్‌గా నియమించారు.. ఇప్పుడు 'హైడ్రా' అంటేనే భూ కబ్జాదారులకు వణుకు పుడుతుంది.. రింగ్‌రోడ్డు వరకు
చెరువులు ఎఫ్‌టిఎల్‌ బఫర్ జోన్‌లో అక్రమ కట్టడాలు, ప్రభుత్వ భూముల కబ్జాలు చేస్తే..! తక్షణమే "వాట్సప్ చేయండి" హైడ్రా టీమ్ రంగంలోకి దిగి చర్యలు ప్రారంభిస్తుంది అంటూ..! హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్("హైడ్రా") కమిషనర్ ఏ.వి.రంగనాథ్ ఐపీఎస్ జారీచేసిన ప్రకటన ఇప్పుడు అక్రమార్కులకు గుబులు పుట్టిస్తోంది.. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకై ప్రతిఒక్కరూ సహకరించాలని..! వాట్సప్‌లో వివరాలను తెలియజేయాలని రంగనాథ్ ఐపీఎస్ ప్రకటన జారీ చేశారు..సర్కారు ఆస్తుల పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు..

అక్రమార్కుల్లో గుబులు..

సీఎం రేవంత్ రెడ్డి నియమించిన హైడ్రా రంగంలోకి దిగింది.. ప్రభుత్వ భూముల పరిరక్షణకై పక్కా ప్రణాళికతో చర్యలకు సిద్ధమైంది.. అక్రమార్కుల్లో గుబులు మొదలైందని తెలుస్తోంది..హైదరాబాదు చుట్టూ ప్రభుత్వ భూములను గుర్తించి వివరాలు పక్కాగా నమోదు చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించింది.. ఈ ప్రత్యేక విభాగానికి ఐపీఎస్ అధికారి ఏ.వి.రంగనాథ్ కమిషనర్‌గా తెలంగాణ ప్రభుత్వం నియమించింది..

టోల్ ఫ్రీ నెంబర్‌లు.. మెయిల్ అడ్రస్ అందుబాటులో..

సర్కారు భూములను కబ్జాచేస్తే తక్షణమే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ, కంట్రోల్ రూమ్ నెంబర్‌లను "హైడ్రా" అందుబాటులోకి తెచ్చింది.. కబ్జాలపై సమాచారాన్ని తెలియజేస్తే..! భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ విజిలెన్స్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.. చెరువులు, నాలాలు, గొలుసుకట్టు కాలువల  ఆక్రమణల వివరాలు తెలియజేసేందుకు "టోల్ ఫ్రీ నెంబర్ 18005990099".. "కంట్రోల్ రూమ్  04029560509, 04029560596, 040 29565758, 04029560953 నెంబర్‌లకు సమాచారమివ్వాలని రంగనాథ్ కోరారు.. వివరాలను హైడ్రా అధికారిక మెయిల్ ఐడీకి directorateofevdm@gmail.com మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.. ఆక్రమణల సమాచారం నేరుగా కమిషనర్‌ను కలిసి వివరించాలనుకుంటే ముందుగా 7207923085 నెంబర్ కు మేసేజ్ పంపించాలని కోరారు..

జీహెచ్ఎంసి సౌజన్యంతో ఫాక్స్‌సాగర్ నాలా ఆక్రమణతో తిరుమల హైట్స్ అపార్ట్‌మెంట్‌..
ఫాక్స్‌సాగర్ నాలాపై తిరుమల హైట్స్ అపార్ట్‌మెంట్‌ "కమాన్" నిర్మాణం.. వెనుకవైపు..

జీడిమెట్ల జీన్స్ ఫ్యాక్టరీ పక్కన ఫాక్స్‌సాగర్ నాలా కబ్జాలో "తిరుమల హైట్స్" అపార్ట్‌మెంట్‌..

About The Author: MADHAV PATHI

మాధవ్ పత్తి,   మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.