కావలి: పెన్ పవర్ నవంబర్ 7
సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేటి నుండి పట్టణంలో ప్రజా సమస్యలపై ప్రజా పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య తెలిపారు. అందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను గురువారం సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 8వ తేదీ నుండి 14వ తేదీ వారం రోజుల వరకు కావలి పట్టణంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని పెరిగిన నిత్యావసర ధరలు, కరెంటు చార్జీలు తగ్గించాలని, ఉచిత ఇసుకను అమలు చేయాలని పట్టణ ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇంకా అనేక ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించడం జరుగుతుందని తెలిపారు. చివరి రోజు 14వ తేదీన ప్రజలను సమీకరించి ఆందోళన చేయడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వై.కృష్ణ మోహన్, జి. మధుసూదన రావు, బి.కృష్ణయ్య, వి.బాబురావు తదితరులు పాల్గొన్నారు.