104 ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కారానికి ఎంపీడీఓ,ఎమ్మార్వో కు వినతి పత్రం .
అల్లవరం,పెన్ పవర్,నవంబర్ 08.
104 డిమాండ్లు పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఎమ్మార్వో వి.వి.ఎల్
నరసింహ రావు,ఎండిఓ కు బి.కృష్ణ మోహన్ కు వినతి పత్రం అందజేశారు.104 ఉద్యోగులు మాట్లాడుతూ తమకు మూడు నెలలుగా జీతాలు రావడం లేదని కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉందని అన్నారు.2020 తర్వాత విధుల్లో చేరిన డ్రైవర్ మరియు డిఇఓ లకు జీవో నెంబర్ 7 ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు .104 వైద్య సేవలు ప్రభుత్వమే
పి హెచ్ సి మెడికల్ ఆఫీసర్స్ ద్వారా నిర్వహించడం వలన క్యాబ్ కేవలం 50,000 రూపాయల ఖర్చుతో నిర్వహించి ప్రజ ధనం వృధా కాకుండా చేయాలి ప్రజాధనం వృధా కాకుండా చెయ్యాలి.అరవిందు యాజమాన్యం అక్రమంగా వసూలు చేసిన పిఎఫ్ తిరిగి చెల్లించాలి అలాగే 74 మంది
సీనియర్ డ్రైవర్లకు స్లాబ్ ప్రకారం జీతాలు వేయాలి డి ఎస్ సి ద్వారా నియమితులైన సీనియర్ డ్రైవర్లకు కాంట్రాక్ట్ లో పెట్టాలి ఉద్యోగుల కు మెడికల్ ఇన్సూరెన్స్ చేయించాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పూర్ణ కుమారి, దయ చారి, శ్రీనివాసరావు,రాజు పాల్గొన్నారు.