కాకినాడలో ఎరుపు రంగు కారుపై అనుమానాస్పద సైరన్ వినియోగం
T24 BR AP 9999 నెంబర్ ప్లేట్ కలర్‌పై కూడా చర్చ కాకినాడ, పెన్ పవర్ ప్రతినిధి ఫిబ్రవరి 28: కాకినాడ నగరంలో ఎరుపు రంగు Hyundai Motor Company i20 కారు (నెంబర్: T24 BR AP 9999) గత రెండు రోజులుగా నిరంతరం సైరన్ మోగిస్తూ సంచరిస్తున్న ఘటన స్థానికుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. వాహనంపై ఎటువంటి ప్రభుత్వ చిహ్నాలు, అధికారిక స్టిక్కర్లు లేదా ప్రోటోకాల్ గుర్తులు కనిపించకపోయినా, సైరన్ వినిపిస్తూ ప్రధాన రహదారులపై ప్రయాణించడం ప్రశ్నార్థకంగా మారింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం,...