ఖడ్గమాల పూజ – నూతన ఆర్జిత సేవ ప్రారంభం

పెన్ పవర్ ప్రత్యేక వార్త రంపచోడవరం: అన్నవరం శ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఉపాలయమైన శ్రీ వనదుర్గ అమ్మవారి ఆలయంలో భక్తుల ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం “ఖడ్గమాల పూజ” పేరుతో నూతన ఆర్జిత సేవను ప్రారంభించారు. ఈ ప్రత్యేక పూజను ప్రతి శుక్రవారం ఉదయం 7.30 గంటల నుండి 8.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.ఈ పూజకు టికెట్ ధర రూ.1,116గా నిర్ణయించారు. ఒక టికెట్‌కు ఖడ్గమాల పూజలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం కల్పించడంతో పాటు పలు...