అంగరంగ వైభవంగా సీత రాముల కళ్యాణం…

Author

A YESOBU

Sr Reporter | ఆంధ్రప్రదేశ్

పుల్లల చెరువు పెన్ పవర్ మార్చి 27 మండల కేంద్రమైన పుల్లల చెరువు సమీపంలోని చౌటపల్లి గ్రామంలో వెలసిన ప్రసన్న ఆంజనేయ స్వామి భక్తుల కోరికలను తీర్చే కల్పతరువుగా విరాజిల్లుతున్నాడు.దూరదూరాల నుంచి తరలి వచ్చే భక్తులతో ఆలయం నిత్యం కిటకిటలాడుతోంది.పూర్వం పుల్లల చెరువు సమీపంలో చౌటపల్లి గ్రామం ఉండేది.తమిళనాడు రాష్ట్రంలోని పేరంబుదూర్ ప్రాంతానికి చెందిన రామానుజ అయ్యంగార్ అనే బ్రాహ్మణుడికి ఈ ప్రాంతంలోని విస్తారమైన శోత్రియ భూములు చెందినవని స్థానిక పెద్దలు చెబుతుంటారు. చౌటపల్లితో పాటు చాపలమడుగు, ఎర్రగొండపాలెం మండలంలోని నరసాయపాలెం గ్రామాల్లోనూ ఆయనకు...