అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగుల సన్మానం
గంగవరం, పెన్ పవర్, మార్చి 7: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గిరికిరణం ఆగ్రో ఫారెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో గంగవరం ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సంస్థ చైర్మన్ టి. వెంకటరమణ, డైరెక్టర్ జడ్పిటిసి ఎ. రత్నం (బేబీ) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళా ఉద్యోగులను గుర్తించి సన్మానించారు.మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి కృషి అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. ...