అటవీ శాఖ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమం

  చింతూరు పెన్ పవర్ మార్చి 25:  అటవీశాఖ ఆధ్వర్యంలో స్థానికంగా భారీ అవగా హన కార్యక్రమం నిర్వహించబడింది. అడవుల్లో నివసించే ప్రజల్లో ప్రకృతి సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా చింతూరు మండల పరిధిలో వివిధ గ్రామాల్లో ప్రత్యేక బృందాలు పర్యటించి ప్రజలకు అటవీ సంరక్షణ, వన్యప్రాణి రక్షణ, అగ్ని ప్రమాదాల నివారణ వంటి అంశాలపై వివరించారు. ముఖ్యంగా వేసవి కాలంలో అడవుల్లో అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు....