అడ్డతీగల మండలం డి.కృష్ణవరం గ్రామంలో పెద్దపులి సంచారం – పశువులపై దాడి, గ్రామంలో భయాందోళనలు.
అడ్డతీగల, పెన్ పవర్, మార్చి 07: అడ్డతీగల మండలంలోని డి.కృష్ణవరం గ్రామంలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అటవీ ప్రాంతానికి సమీపంగా ఉన్న ఈ గ్రామంలో మేతకు వెళ్లిన పశువులపై పులి దాడి చేయడంతో ఒక ఆవు, దాని దూడ మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనతో గ్రామస్థులు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానిక సమాచారం ప్రకారం, గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో పశువులను మేతకు తీసుకెళ్లిన సమయంలో పులి అకస్మాత్తుగా దాడి చేసినట్లు తెలుస్తోంది. పశువుల కాపరులు...