అన్నదాత సుఖీభవ పై విస్తృత డోర్ టు డోర్ అవగాహన

చింతూరు, పెన్ పవర్, మార్చి 25: చింతూరు మండలంలోని జువ్విగూడెం గ్రామంలో రైతన్న మీకోసం అన్నదాత సుఖీభవ కార్యక్రమం బుధవారం నిర్వహించబడింది. కార్యక్రమంలో భాగంగా గ్రామంలో విస్తృతంగా డోర్ టు డోర్ ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి చింతూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ జమాల్ ఖాన్ నేతృత్వం వహిస్తూ, రైతుల వద్దకు నేరుగా వెళ్లి అన్నదాత సుఖీభవ పథకం ప్రయోజనాలను వివరించారు. ప్రతి రైతు ఇంటిని సందర్శిస్తూ పథకం ద్వారా లభించే ఆర్థిక సహాయం, అర్హతలు, దరఖాస్తు విధానం వంటి అంశాలను...