గంగవరం, పెన్ పవర్, మార్చి 31: పోలవరం జిల్లాలో “ఆపరేషన్ వజ్రప్రహార్”లో భాగంగా గంగవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తాడ గ్రామంలో పోలీసులు మంగళవారం ఉదయం విస్తృతంగా కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.అడ్డతీగల సీఐ నరసింహమూర్తి ఆధ్వర్యంలో గంగవరం ఎస్సై వెంకయ్య, అడ్డతీగల ఎస్సై వినోద్ కుమార్ మరియు పోలీసు సిబ్బంది గ్రామంలో అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, పత్రాలు లేని మూడు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా గ్రామ ప్రజలకు గుప్త నిధులు, మూఢనమ్మకాలు, గంజాయి వినియోగం నివారణ,...