ఆస్తి అధికారంపై వ్యామోహం.. ఇదే జగన్ పాలసీ
తల్లీ, చెల్లెళ్లపై విద్వేషం, ఇదే జగన్ పాలసీ ప్రజా ప్రభుత్వంపై దుష్ప్రచారం.. పరంధామునితో రాజకీయ క్రీడలాడుతూ జగన్..వైసీపీనేతలు ఘోరపాపానికి పాల్పడుతున్నారు : ప్రత్తిపాటి చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 21: చిలకలూరిపేట : ఆస్తిపాస్తుల్ని..అధికారాన్ని ప్రేమించాలి. తండ్రి వారసత్వంగా ఇచ్చిన సొమ్ములో వాటాలడిగే తల్లిని, చెల్లిని ద్వేషించాలి. బాబాయ్ హత్యతో లబ్ధిపొందాలి.. ఆయన బిడ్డను మాత్రం సూటిపోటి మాటలతో వేధించాలి. అన్నదే జగన్ పాలసీ. ఈ ప్రాథమిక సిద్ధాంతాలకు కట్టుబడ్డ జగన్ ఐదేళ్లపాటు ప్రజలను, రాష్ట్రాన్ని తాను ఉద్దరించినట్టు.. ఇప్పుడున్న ప్రజా ప్రభుత్వం...