ఉద్యాన పంటలను సాగుచేయాలి* రైతులకు జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి పిలుపు.
భోగాపురంలో పర్యటించి పంటల పరిశీలన స్టాఫ్ రిపోర్టర్ పెన్ పవర్, విజయనగరం. మార్చి 06 : అత్యధిక లాభాలను ఇచ్చే ఉద్యాన పంటలను సాగు చేయాలని జిల్లా రైతాంగానికి కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. భోగాపురం మండలంలో శుక్రవారం కలెక్టర్ పర్యటించారు. కొయ్యపేటలో రైతులు సాగుచేస్తున్న ఉద్యాన పంటలను పరిశీలించారు. పొలాల్లో దిగి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సాగు చేస్తున్న పద్దతులు, మార్కెట్ సదుపాయం తదితర అంశాలను ఆరా తీశారు. వరి స్థానంలో అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే ఉద్యాన పంటలవైపు రైతులు...