ఎంపీడీవో కార్యాలయం వద్ద ఘనంగా సాసా కార్యక్రమం
పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ – మండల అభివృద్ధిపై అధికారుల సమీక్ష కాజులూరు, పెన్ పవర్, మార్చి 28: కాజులూరు మండల ఎంపీడీవో జె. రాంబాబు ఆధ్వర్యంలో శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర (సాసా) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.మండల పరిధిలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు సమావేశానికి హాజరై పరిశుభ్రత, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు.అనంతరం అధికారులు భారీ ర్యాలీగా కాజులూరు ప్రధాన వీధుల్లో పర్యటిస్తూ పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ,...