కాకినాడ జిల్లాలో ‘పులి’ కలకలం ప్రత్తిపాడు నియోజకవర్గంలో హైఅలర్ట్

కిర్లంపూడి/ప్రత్తిపాడు, పెన్ పవర్, మార్చి 13:కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలో గత కొన్ని రోజులుగా పెద్దపులి దోబూచులాడడంతో ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. శంఖవరం మండలం గౌరంపేట పంచాయతీ పరిధిలోని రాజవరం, మాసంపల్లి గ్రామాల మధ్య ఉన్న సరుగుడు తోటల్లో పులి తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు ధృవీకరించడంతో జనం హడలిపోతున్నారు. రేడియో కాలర్ రహస్యం-సాంకేతిక నిఘా పులి కదలికలను కనిపెట్టడంలో జీపీఎస్ రేడియో కాలర్ కీలక పాత్ర పోషిస్తోంది. గతంలో ఏదైనా టైగర్ రిజర్వ్ పరిధిలో ఈ పులిని...