కోర్టు తలుపులు తట్టే ప్రతి వ్యక్తికి విశ్వాసం కల్పించాల్సిన భాద్యత న్యాయమూర్తులదే. –భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.
తిరుపతి క్రైమ్ బ్యూరో, పెన్ పవర్, మార్చి 1. న్యాయ సేవల కోసం కోర్టు తలుపులు తట్టే వేలాది మందికి న్యాయం లభిస్తుందన్న విశ్వాసం కల్పించాల్సిన భాద్యత న్యాయమూర్తులందరి పై ఉందని భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు.ఆదివారం తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్.వి.ఎన్. భట్టి, జస్టిస్ జాయ్...