కాజులూరు, పెన్ పవర్,మార్చి 31: ఐపీఎల్ (ఐపిఎల్) క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభమైన నేపథ్యంలో మండలంలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గొల్లపాలెం ఎస్సై ఎం. మోహన్ కుమార్ హెచ్చరించారు.ఈ సందర్భంగా యువత, తల్లిదండ్రులను ఉద్దేశించి ఆయన పలు కీలక సూచనలు చేశారు.ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో బెట్టింగ్ కార్యకలాపాలు పెరిగే అవకాశముండటంతో మండల వ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ బృందాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బెట్టింగ్ నిర్వహించినా, ప్రోత్సహించినా లేదా పాల్గొన్నా ఆంధ్రప్రదేశ్ గేమింగ్ చట్టం (ఏపీ గేమింగ్ యాక్ట్...