గణపవరంలో పోలీసుల కార్డన్ సెర్చ్

మారణాయుధాలు, 70 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చిలకలూరిపేట , పెన్ పవర్, మార్చి 26 : నాదెండ్ల : గణపవరం గ్రామంలో పోలీసులు తెల్లవారుజామున భారీ స్థాయిలో 'కార్డన్ సెర్చ్' తనిఖీలు నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ విస్తృత తనిఖీలు చేపట్టారు. అడిషనల్ ఎస్పీ నిరంజన్, డీఎస్పీ హనుమంతురావు ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన ఈ ఆపరేషన్‌లో 30 మంది ఉన్నతాధికారులు, దాదాపు 200 మంది పోలీస్ సిబ్బంది...