గ్యాస్ కొరతపై ప్రజలు ఆందోళన చెందొద్దు
గ్యాస్ కొరతపై ప్రజలు ఆందోళన చెందొద్దు -టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ నర్సీపట్నం, పెన్ పవర్ : ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ కొరత వస్తుందన్న వదంతులతో ప్రజలు భయాందోళనలకు గురికావొద్దని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కోరారు. మంగళవారం నర్సీపట్నంలో స్థానిక తహశీల్దార్, పౌరసరఫరాల శాఖ సిబ్బంది, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులతో ఆయన సమావేశమై క్షేత్రస్థాయిలోని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. యుద్ధం కారణంగా నౌకల రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో, గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవగాహన...