ఘనంగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి

కాజులూరు, పెన్ పవర్, మార్చి 23: శెట్టిబలిజ జాతి పితామహుడు, సామాజిక విప్లవ నాయకులు, శెట్టిబలిజ సంక్షేమ సంఘ స్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి కార్యక్రమం కాజులూరు మండలంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగ శెట్టిబలిజ సంఘ నాయకులు, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం దుగ్గుదూరులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ,శెట్టిబలిజ సంక్షేమ సంఘం ద్వారా బలహీన వర్గాల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించిన మహనీయుడు దొమ్మేటి వెంకటరెడ్డి అని కొనియాడారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా...