చింతపల్లి నియోజకవర్గ పునరుద్ధరణపై ఆశలు

చింతపల్లి నియోజకవర్గ పునరుద్ధరణపై ఆశల (స్టాప్ రిపోర్టర్ మాదిరి చంటిబాబు)గూడెం కొత్త వీధి, పెన్ పవర్, మార్చి 25:గతంలో ఉమ్మడి విశాఖ పట్నం జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందిన చింతపల్లి శాసనసభ నియోజకవర్గం మళ్లీ పునరుద్ధరించాలన్న ఆశలు స్థానిక ప్రజల్లో మళ్లీ చిగురిస్తున్నాయి. అప్పట్లో చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాలతో పాటు నాతవరం, గొలుగొండలలోని గిరిజన గ్రామాలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉండేవి.కాలక్రమేణా జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో చింతపల్లి నియోజకవర్గం రద్దై, ప్రస్తుతం పాడేరు నియోజకవర్గంలో విలీనమైంది. దీంతో గిరిజన ప్రాంతాల ప్రత్యేక అవసరాలు,...