చింతూరు సిహెచ్‌సీపై ఆకస్మిక తనిఖీ

చింతూరు, పెన్ పవర్ మార్చి 26: జిల్లా హాస్పిటల్ సేవల సమన్వయకర్త (డీసీహెచ్‌ఎస్) డా. నీలవేణి చింతూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సిహెచ్‌సీ)ను ఆకస్మికంగా సందర్శించి, ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అన్ని వార్డులను పరిశీలించి, పరిశుభ్రత, రోగులకు అందిస్తున్న సేవలు, నిర్వహణ పరిస్థితులను సమీక్షించారు. స్పెషల్ న్యూ బోర్న్ కేర్ యూనిట్ (ఎస్‌ఎన్‌సీయూ)ను సందర్శించి, అక్కడ నిర్వహణ బాగుందని సిబ్బందిని అభినందించారు. అనంతరం డయాలిసిస్ కేంద్రాన్ని తనిఖీ చేసి, చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను...