చిలకలూరిపేట మున్సిపల్ మార్కెట్ల బహిరంగ వేలం – ఆదాయం పెరుగుదల
సండ్రి మార్కెట్ వేలం అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది చిలకలూరిపేట: స్థానిక పురపాలక సంఘం పరిధిలోని వివిధ మార్కెట్ల నిర్వహణ హక్కుల కోసం బుధవారం బహిరంగ వేలం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు పర్యవేక్షణలో ఆయన ఛాంబర్‌లో జరిగిన ఈ వేలంలో రెవెన్యూ ఆఫీసర్ సుబ్బారావు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ గిరి పాల్గొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మున్సిపాలిటీకి ఆదాయం పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. మాంసం, చేపల మార్కెట్ నిర్వహణ హక్కుల కోసం జరిగిన వేలంలో గత ఏడాది (2025-26)...