జిల్లాలో జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి – జిల్లా జాయింట్ కలక్టరు సేతు మాధవన్
విజయనగరం పెన్ పవర్ మార్చి 03: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 16వ జనాభా గణన (సెన్సస్ 2027) ప్రక్రియను జిల్లాలో ఎటువంటి లోపాలు లేకుండా, పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా, మొదటి దశ అయిన ‘గృహాల జాబితా మరియు గృహ వసతుల గణన’ (హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్) పై జిల్లా చార్జి లెవెల్ అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలక్టరు మరియు అదనపు ప్రిన్సిపల్ సెన్సస్ అదికారి సేతు మధవన్ మంగళవారం...