గూడెం కొత్తవీధి,పెన్ పవర్,మార్చి 29:జీకే వీధి మండలంలో క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని స్థానిక నేతన్య క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో పాస్టర్ జాన్ మార్క్ నేతృత్వంలో కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా చిన్నారులు మట్టలు పట్టుకొని ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, గీతాలు ఆలపిస్తూ భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో పాల్గొన్నారు.మట్టలతో చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సండే స్కూల్ టీచర్ శారద సహా విశ్వాసులు పెద్ద సంఖ్యలో...