తెరుచుకున్న జీకే వీధి పెట్రోలు బంక్

బకాయిలు చెల్లింపుతో విక్రయాలు ప్రారంభం గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 19: గత వారం రోజులుగా మూతపడిన గూడెం కొత్త వీధి పెట్రోల్ బంక్ ఎట్టకేలకు తెరుచుకుంది. బుధవారం రాత్రి నుంచి బంకు సూపరిండెంట్ జుర్ర శ్రీనివాసరావు విక్రయాలను పున ప్రారంభించారు. గిరిజన సహకార సంస్థ, పాడేరు ఐటిడిఏ సంయుక్తంగా జీకే వీధిలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంకు హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ ఇంధనాన్ని సరఫరా చేస్తోంది. అయితే ఆ సంస్థకురూ. 25 లక్షలు బకాయి ఉండడంతో ఆ సంస్థ ఇంధనం సరఫరాను నిలిపివేసింది....