నర్సీపట్నంలో గ్యాస్ కోసం ఆందోళన చెందవద్దు -తగినన్ని రప్పించాం -ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం -స్పీకర్ అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మరిడి మహాలక్ష్మి అమ్మవారి పండుగ సందర్భంగా ప్రజలకు గ్యాస్ సిలిండర్ల కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ సరఫరాలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమేనని, వంట గ్యాస్ కోసం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని...