నర్సీపట్నం నూకాంబికా అమ్మవారి దర్సనానికి పోటెత్తిన భక్తజనం
శ్రీనూకాంబికా అమ్మవారి దర్సనానికి పోటెత్తిన భక్తజనం నర్సీపట్నం, పెన్ పవర్ : కొత్త అమావాస్యను పురస్కరించుకుని నర్సీపట్నంలో శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. బుధవారం తెల్లవారుజాము నుండే అమ్మవారి దర్శనానికి మహిళలు బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలు సమర్పించుకున్నారు. నూతన ఆలయంలో కొలువైన అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నూతన ఆలయాన్ని, అమ్మవారి నూతన విగ్రహాన్ని దర్శించుకునేందుకు ప్రజలు ఆసక్తి కనబరిచారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ...