నర్సీపట్నం మరిడమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు -స్పీకర్ అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నంలో ఈ నెల 31, ఒకటవ తేదీలలో అంగరంగ వైభవంగా జరగనున్న శ్రీ మరిడమ్మ అమ్మవారి పండగకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. గురువారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ వి.వి. రమణ, డిఎస్పి శ్రీనివాస్ మరియు ఎనిమిది శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. లక్ష మందికి పైగా హాజరయ్యే ఈ వేడుకల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రెవెన్యూ, పోలీస్,...