నూకాలమ్మ జాతరకు సర్వం సిద్ధం
-ఏర్పాట్లను పరిశీలించిన స్పీకర్ నర్సీపట్నం, పెన్ పవర్ (మార్చి 16) : రెండు రోజుల పాటు జరుగనున్న నూకాలమ్మ జాతరకు అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. కొత్త అమావాస్య పురస్కరించుకుని మంగళవారం పెద్దజాగరణ, బుధవారం జాతర జరగనుంది. భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చే ఉండటంతో దేవాదాయ, ధర్మాదాయ శాఖతో పాటు ఆలయకమిటీ కూడా విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇటీవల నూతన ఆలయంలో కొలువుదీరిన అమ్మవారిని దర్సించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలి వచ్చే అవకాశం ఉండటంతో, ఆలయం వద్ద ఏర్పాట్లను స్పీకర్ అయ్యన్నపాత్రుడు...