నేటితో ముగిసిన మున్సిపాలిటీల పదవీకాలం

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ నర్సీపట్నం, మార్చి 17: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల పదవీకాలం నేటితో ముగియనుంది. నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి అధ్యక్షతన చివరి కౌన్సిల్ సమావేశం జరిగింది. నర్సీపట్నం మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన తర్వాత ఇప్పటికీ రెండు మార్లు ఎన్నికలు జరిగాయి. మొదట తెలుగుదేశం పార్టీ బోర్డును కైవసం చేసుకోగా, రెండవసారి వైసిపి జెండా ఎగిరింది. తొలి ఎన్నికలు 27 వార్డులకు జరుగగా టిడిపి తరఫున చింతకాయల అనిత చైర్ పర్సన్ గా ఐదేళ్లపాటు పాలన సాగించారు. రెండవసారి...