పల్లె నిద్రతో ప్రజలకు మరింత భరోసా ఎస్సై డి. రామ్ కూమార్
సీతానగరం, పెన్ పవర్, మార్చి24: గ్రామాలు, వార్డుల్లో పోలీసులు నిర్వహిస్తున్న పల్లెనిద్ర కార్యక్రమంతో ప్రజలకు మరింత భరోసా కల్పిస్తున్నామని ఎస్సై డి. రామ్ కూమార్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ నార్త్ డి.ఎస్.పి రామకృష్ణ కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ వి.వి. ఎస్ మూర్తి పర్యవేక్షణలోమంగళవారం రాత్రి సీతానగరం మండలంలోని పోలీసుస్టేషన్ పరిధిలో పోలీసు అధికారులు, గ్రామాల కానిస్టేబుళ్లు ‘పల్లె నిద్ర’ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ పల్లె నిద్ర కార్యక్రమంతో ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని కలిగిస్తున్నామన్నారు....