పిఠాపురం పట్టణ అభివృద్ధికి తొలి ప్రాధాన్యత – మంత్రి నారాయణ

కాకినాడ/పిఠాపురం, పెన్ పవర్,మార్చి 23, పిఠాపురం పట్టణంలో తాగునీరు, డ్రైన్స్, సీసీ రోడ్లు, వీధీ దీపాలు, పార్కుల అభివృద్ధి వంటి మౌలిక వసతుల పనులకు తొలి ప్రాధాన్యతనిచ్చి వేగంగా అమలు చేస్తామని జిల్లా ఇంఛార్జి మంత్రి, పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.సోమవారం కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా పిఠాపురంలో పర్యటించిన మంత్రి నారాయణ, మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి పట్టణ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్, ఆర్డీఎంఏ...