పెద్దపులి సంచారం.. పశువుపై దాడి

ప్రజల్లో భయాందోళనలు – బంధించేందుకు అటవీశాఖ ప్రయత్నాలు గంగవరం /రాజవొమ్మంగి, పెన్ పవర్, మార్చి 10: పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం మారేడుబాక పంచాయితీ కోసూరి వారి వీధి గ్రామ పరిధిలోని పొలాల్లో ఉన్న పశువుపై సోమవారం రాత్రి పెద్దపులి దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.గ్రామస్తుల సమాచారం మేరకు అటవీశాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గత రెండు రోజులుగా రాజవొమ్మంగి మండల పరిధిలోకి ప్రవేశించిన పెద్దపులి...