వెనుకబడిన వర్గాలకు ఆర్థిక, సామాజిక చేయూత అందించాలన్నదే పీ-4 పథకం ప్రధానోద్దేశం. బంగారు కుటుంబాలకు అండగా నిలిచిన మార్గదర్శుల్ని సన్మానించిన ప్రత్తిపాటి. పీ-4 పథకం తొలి వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్తిపాటి. చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 30 : చిలకలూరిపేట : ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన పేద, మధ్య తరగతి వర్గాలను గుర్తించి, వారికి చేయూత నివ్వాలన్నదే పీ-4 లక్ష్యమని, పేదరికం లేని రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నదే చంద్రబాబు ప్రధాన ఆలోచన అని, దానిలో పీ-4 తొలి అడుగని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాట...