పోలవరం జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు పూర్తి ఏర్పాట్లు
4184 మంది విద్యార్థులు హాజరు కానున్నారు – ఏజెన్సీ డీఈవో వై. మల్లేశ్వరరావు గంగంగవర-పెన్ పవర్: పోలవరం జిల్లాలో నిర్వహించనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఏజెన్సీ డీఈవో వై. మల్లేశ్వరరావు తెలిపారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.జిల్లా పరిధిలోని రంపచోడవరం, చింతూరు డివిజన్లలో మొత్తం 105 పాఠశాలల నుండి 4184 మంది విద్యార్థులు ఈసారి పరీక్షలకు హాజరుకానున్నారు. వీరి కోసం 32 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు...