పోలవరం జిల్లా తొలి కలెక్టర్‌గా కె. దినేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ
రంపచోడవరం, మార్చి 28 (పెన్ పవర్): పోలవరం జిల్లా తొలి కలెక్టర్‌గా కె. దినేష్ కుమార్ శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. రంపచోడవరం పి.ఎం.ఆర్.సి కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్‌లో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన పోలవరం పేరుతో ఏర్పడిన జిల్లాకు సేవలందించడం గర్వంగా భావిస్తున్నానని కలెక్టర్ పేర్కొన్నారు. “ప్రజలే ప్రథమం (People First)” అనే విధానంతో పరిపాలనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకాల మేరకు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు...