ప్రజా రంజక పాలనలో భావి రాజకీయ తరాలకు, పార్టీలకు అసలైన మార్గదర్శి చంద్రబాబు : ప్రత్తిపాటి
రామరాజ్యానికి నిలువెత్తు నిర్వచనం నేటి కూటమి ప్రభుత్వ పాలన ప్రజలకు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు, జనసేన, బీజేపీ శ్రేణులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 26 : చిలకలూరిపేట : రాష్ట్ర ప్రజలకు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకు, మిత్ర పక్షాలైన జనసేన , బీజేపీ శ్రేణులకు శ్రీ రామ నవమి పర్వదిన శుభాకాంక్షలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ, విభజనానంతర ఏపీలో గానీ రామ రాజ్యం అనే మాటకు సజీవ తార్కాణంగా నిలిచిన సుపరిపాలన అందించిన ఏకైక రాజకీయపార్టీ...