ఫ్లాష్ ఫ్లాష్… రామచంద్రపురంలో విద్యుత్ షాక్ విషాదం – యువకుడు మృతి, ఇద్దరికి గాయాలు… ఘటనపై మంత్రి ఆగ్రహం

రామచంద్రపురం, పెన్ పవర్,మార్చి 24: రామచంద్రపురం మండలంలోని పెద్ద తాళ్లపాలెం రోడ్డువద్ద జరిగిన విషాద ఘటనలో విద్యుత్ షాక్ కారణంగా ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.విద్యుత్ వైర్లపై పనులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కరెంట్ ప్రవహించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు దాసరి సూర్యప్రకాశ్ (21)గా గుర్తించారు. ఆయన కృష్ణా జిల్లా నుంచి ఉపాధి కోసం వలస వచ్చి విద్యుత్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. పనుల మధ్యలో విద్యుత్ వైర్లపై పడిపోవడంతో తీవ్రంగా షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.ఈ ప్రమాదాన్ని...