రామచంద్రపురం పెన్ పవర్, మార్చి 29: రామచంద్రపురం పట్టణంలో యేసు ప్రేమాలయం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో జయప్రవేశపు ఆదివారం (పామ్ సండే) సందర్భంగా విశేష భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మట్టలకు పువ్వులు గుచ్చి, కీర్తనలు పాడుతూ పట్టణ ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు.సంఘ పాస్టర్ రెవరెండ్ ఎం. రాజ్ కుమార్ మాట్లాడుతూ, క్రైస్తవులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో జయప్రవేశపు ఆదివారం ఒక ముఖ్యమైన రోజు అని తెలిపారు. ఈస్టర్ పండుగకు ముందు వచ్చే ఈ ఆదివారం, సుమారు...