మంచి-చెడులను సమానంగా స్వీకరించాలి.. ఎస్సై సాంబ శివరావు

పుల్లల చెరువు పెన్ పవర్ మార్చి 19 ఉగాది పండుగ తెలుగు ప్రజలకు ప్రత్యేకమైన పర్వదినమని ఎస్సై సాంబ శివరావు అన్నారు. పుల్లల చెరువు మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ కళా ప్రాంగణంలో ఉగాది సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది అనేది షడ్రుచుల సమ్మేళనం అని, జీవితం లో ఎదురయ్యే విభిన్న అనుభవాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు మనుషుల జీవితంలో కలిగే సుఖదుఃఖాలను, విజయాపజయాలను సూచిస్తాయని...