మండలంలో పలు చోట్ల ఘనంగా సీతారాముల కల్యాణం
కాజులూరు, పెన్ పవర్, మార్చి 27: కాకినాడ జిల్లా కాజులూరు మండల పరిధిలోని తణుకువాడ, డేగలపేట, శలపాక, మంజేరు, గొల్లపాలెం జర్నలిస్టు కాలనీ, పాపయమ్మపేట గ్రామాల్లో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.గొల్లపాలెం, పాపయమ్మపేటలోని ప్రసిద్ధ శ్రీ సీతారామ లక్ష్మణ హనుమ రామాలయంలో నిర్వహించిన కల్యాణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా నంది కోళ్ల సుబ్బారావు – సత్యవతి దంపతులు పీటలపై కూర్చొని కల్యాణాన్ని నిర్వహించారు. శుక్రవారం ఉదయం 8:30 గంటలకు స్వామివారిని అమ్మవారిని పల్లకిలో గ్రామంలో భక్తులతో “జై...