మావుళ్ళమ్మ ఆలయ అభివృద్ధికి భారీ విరాళం 1.63 లక్షలతో ఆలయ సుందరీకరణ

  సీతానగరం, పెన్ పవర్, మార్చి 8 : సీతానగరం మండలకేంద్రంలో కొలువైన శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ నాయకుడు గద్దె వెంకటకృష్ణ (నల్లి) తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన మేనమామ పెండ్యాల కుటుంబ సభ్యులతో కలిసి రూ. 1.63 లక్షల విరాళంతో ఆలయ ప్రాంగణంలో టైల్స్ వేయించి, ఇతర అభివృద్ధి పనులను పూర్తి చేయించారు. గతంలో ఆలయ ప్రాంగణంలో భక్తులు నడవడానికి ఇబ్బందిగా ఉండేదని, ప్రస్తుతం సుందరంగా తీర్చిదిద్దిన టైల్స్ మార్గం వల్ల అమ్మవారిని దర్శించుకోవడం సులభతరమైందని భక్తులు...