ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకున్న పట్రా రమేష్ బాబు
చింతూరు పెన్ పవర్, మార్చి 19: గిరిజన సంప్రదాయ కళలకు విశేష సేవలందిస్తున్న ప్రముఖ కళాకారుడు కొమ్ముకోయ రమేష్ బాబు కి 2026 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారం ప్రదానం చేసింది. ఈ అవార్డును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదగా అందుకోవడం ఆయనకు ప్రత్యేక గౌరవంగా నిలిచింది. సంప్రదాయ గిరిజన కళారూపమైన కొమ్ముకోయ కళను పరిరక్షిస్తూ, విస్తరింపజేస్తూ రమేష్ బాబు చేస్తున్న కృషిని ప్రభుత్వం గుర్తించింది. చిన్ననాటి నుంచే కళపై ఆసక్తి పెంపొందించుకుని, రాష్ట్రవ్యాప్తంగా అనేక...