మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం
చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 23 : ఎడ్లపాడు : మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు రైతుల పంటను పూర్తిగా కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల కమిటీ డిమాండ్ చేసింది. మండలంలోని వేలాది ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంటను సాగు చేసినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. ఎక్కువ మంది రైతులు చిన్న, సన్నకారు రైతులే కావడంతో ప్రైవేట్ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని పంటను సాగు చేయాల్సి వచ్చిందని...