మొబైల్ కౌంటర్‌లో పన్ను కట్టండి-నిమిషాల్లో రశీదు పొందండి: మున్సిపల్ ఆర్.ఐ
చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 23 : చిలకలూరిపేట: పట్టణ ప్రజలు పన్నులు చెల్లించే ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ పురపాలక సంఘం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు ఆదేశాలు, ఆర్.ఓ. సుబ్బారావు సూచనల మేరకు మున్సిపల్ ఆర్.ఐ. అబ్దుల్ ఖాదర్ ఆధ్వర్యంలో 'మొబైల్ కౌంటర్' సేవలను ప్రారంభించారు. ఈ మొబైల్ కేంద్రం ద్వారా ప్రజలు మున్సిపల్ కార్యాలయానికి లేదా సచివాలయాలకు వెళ్లే పనిలేకుండా, ఉన్న చోటే కేవలం రెండు సెకన్లలో పన్ను కట్టి రిసిప్ట్...