రంగారావు సేవా ధృక్పథం భావితరాలకు స్ఫూర్తినిస్తుంది : ప్రత్తిపాటి
చిలకలూరిపేట పెన్ పవర్: ఆసిస్ట్ సంస్థ నిర్వాహకులు, స్వచ్ఛంద సేవకులు, సామాజిక సేవా తత్పరులు అయిన శ్రీ జాస్తి రంగారావుకు ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారం లభించడం నియోజకవర్గానికే గర్వకారణమని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కొనియాడారు. గురువారం విజయవాడలోని తుమ్మల పల్లి కళాక్షేత్రంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉగాది సేవా పురస్కారం పొందిన పట్టణానికి చెందిన జాస్తి రంగారావును. స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రత్తిపాటి, నియోజకవర్గ టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించి, అభినందనలు తెలియచేశారు.ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ.. రంగారావు సేవా ధృక్పథం.. సామాజిక...