రైతుల గుదిబండగా కూరాడ డ్రైయిన్‌లో గుర్రపు డెక్క
నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం – అధికారుల నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం కాజులూరు, పెన్ పవర్, మార్చి 28: మండల పరిధిలోని కూరాడ కెనాల్, మేజర్ డ్రైయిన్‌లో దట్టంగా పేరుకుపోయిన గుర్రపు డెక్క, తూటు మరియు చెత్తాచెదారం రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. కాలువల్లో నీటి ప్రవాహం సక్రమంగా సాగకపోవడంతో దిగువ ప్రాంతాల పంటపొలాలకు సాగునీరు చేరక రైతులు ఆందోళన చెందుతున్నారు.స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం,ఉప్పు టేరు వరకు గుర్రపు డెక్క విస్తరించి నీటి ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకుంటోంది. ఫలితంగా నీరు సకాలంలో...