చింతూరు, పెన్ పవర్ మార్చి 29: ఈ సంవత్సరం సంభవించే వరదలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. ఆదివారం చింతూరులోని ఐటీడీఏ సమావేశపు హాలులో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల ఇంజనీర్లు మరియు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వరదలు ఎప్పుడైనా వచ్చినా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని...