వామ్మో.. పోలవరం జిల్లాలోకి మళ్లీ పెద్దపులి
పెన్ పవర్ రంపచోడవరం ఇటీవల కాకినాడ జిల్లాలో పలు ప్రాంతాల్లో సంచరించిన పెద్దపులి మరోసారి పోలవరం జిల్లాలోకి ప్రవేశించడం స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం రాత్రి రాజవొమ్మంగి మండలంలోని కొండలింగంపర్తి, కొత్తపల్లి గ్రామాల సమీప అటవీ ప్రాంతాల్లో పులి సంచారం ఉన్నట్లు నిర్ధారణ అయింది. స్థానికులు ఇచ్చిన సమాచారం ఆధారంగా అటవీ అధికారులు వెంటనే పరిశీలన చేపట్టి, పులి కాళ్ల ముద్రలు, ఇతర ఆనవాళ్లను గుర్తించారు. ప్రస్తుతం ఈ పెద్దపులి బోర్నగూడెం పరిసర ప్రాంతాల్లో...